![]() |
![]() |

అష్షు రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రకరకాల రీల్స్ చేస్తూ ఫుల్ ఛిల్ల్ అవుతూ ఉంటుంది. అలాంటి అష్షుకి ఇప్పుడు మూడ్ అంతా మొగుడు మీదకు మళ్లినట్లు తెలుస్తోంది. ఇక అష్షు తనకు కాబోయే వాడికి కండిషన్స్ చెప్తూ రీల్ చేసేసరికి వాళ్ళ అమ్మ చీపురు కట్ట పట్టుకొచ్చి చితకబాదేసింది.
.webp)
అష్షు రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది..అందులో " మా ఆయన ఉదయాన్నే లేచి దీపం పెట్టి నేను ఎలాగో గుడికి వెళ్ళను కాబట్టి ఆయనే గుడికి వెళ్లి పూజ చేయాలి...అలాగే నేను ఎక్కువగా అలుగుతాను..అప్పుడు బుజ్జగించాలి...నేను అలిగినప్పుడు బతిమాలాలి..ఇంకా షాపింగ్ కి తీసుకెళ్ళాలి...నాకు కొత్త బట్టలు కొనుక్కోవడం ఎక్కువగా ఇష్టం. కాబట్టి తాను కూడా ఫోర్స్ చేయకుండా నన్ను ఫ్రీగా, ఫ్రీడమ్ గా వదిలేయాలి" అనేసరికి ఆ మాటలన్నీ అష్షునే మాట్లాడుతోందనుకుని వాళ్ళ అమ్మ వెనక నుంచి చీపురు కట్ట పట్టుకొచ్చి కొట్టింది. ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి " మా అమ్మ ఇది నా వాయిస్ అనుకుంది" అంటూ కామెంట్ పెట్టుకుంది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ "హహ క్యూట్" అని కామెంట్ చేసాడు. "ఎందుకు యమునా గారి వాయిస్ ఖూనీ చేస్తావ్ ..నీ ఫీలింగ్ చెప్పు" అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇక అష్షు-అజయ్ కలిసి నటించిన "హే పిల్ల" అనే సాంగ్ ఈ నెలాఖరున ఆస్ట్రేలియాలో లంచ్ చేస్తున్నాడు రాహుల్ సిప్లిగంజ్.
![]() |
![]() |